Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాస్టర్ మహేంద్రన్ 'వసుదేవసుతం' ట్రైలర్ విడుదల

మాస్టర్ మహేంద్రన్ 'వసుదేవసుతం' ట్రైలర్ విడుదల

వార్త 1 week ago

Vasudevasutam Trailer: యాక్టర్ మాస్టర్ మహేంద్రన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా బహుభాషా చిత్రం 'వసుదేవసుతం' (Vasudevasutam) ట్రైలర్ మంగళవారం విడుదలైంది.

డివోషనల్ ఎలిమెంట్స్ మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా చిత్రం తెలుగు, తమిళం, హిందీ, ఒడియా భాషల్లో విడుదల కానుంది.

పవిత్ర నిధి చుట్టూ తిరిగే కథాంశం

ఒడిశాలోని ఒక పురాతన ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగనుంది. గుడిలోని ఒక పవిత్రమైన నిధిని రక్షించడానికి, అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక సామాన్య యువకుడు దుష్ట శక్తులతో ఎలా పోరాడాడు అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా విడుదలైన 2 నిమిషాల నిడివి గల ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. భక్తిభావం ఉట్టిపడే విజువల్స్‌తో మొదలైన ట్రైలర్, ఆ తర్వాత భారీ యాక్షన్ సీన్లతో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లింది. ముఖ్యంగా భగవంతుడి ఉనికిని ప్రశ్నించేవారికి హెచ్చరికగా వచ్చే డైలాగులు, గరుత్మంతుడికి సంబంధించిన షాట్స్ ట్రైలర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Vasudevasutam Trailer: చివరి 45 నిమిషాలు వన్ మ్యాన్ షో!

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి తత్త్వం, నేపథ్యంతో సాగే ఈ కథను ఎంతో రీసెర్చ్ చేసి, మనసు పెట్టి తీశామని, ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ, “సినిమాలో పవర్‌ఫుల్ డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హైలైట్‌గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు సాగే చివరి 45 నిమిషాల ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రాన్ని రెయిన్‌బో సినిమాస్ పతాకంపై ధనలక్ష్మి బడార్ల నిర్మించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించారు. అంబికావాణి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఐశ్వర్య, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha