Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ విజయ్ మరియు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మధ్య ఉన్న స్నేహంపై గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఒక్క పోస్ట్‌తో తెరపడింది.
సీఎం విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని త్రిష తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన ఫోటో మరియు భావోద్వేగపూరితమైన క్యాప్షన్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
అన్‌ఫాలో రూమర్స్.. అసలేం జరిగిందంటే?
జూన్ 22న విజయ్ 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే, ఎప్పుడూ విజయ్ బర్త్‌డేకి ముందు వరుసలో ఉండి శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిందని, ఇద్దరి మధ్య స్నేహబంధం దెబ్బతిన్నదంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఈ గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ విజయ్‌తో దిగిన ఒక అందమైన ఫోటోను, ఆయన బర్త్‌డే కేక్ పిక్‌ను త్రిష అభిమానులతో పంచుకున్నారు.
Trisha Krishnan: ‘00.00’ క్యాప్షన్ వెనుక అసలు కథ!
విజయ్ కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “ప్రతి విషయానికి విలువనిచ్చే ఆ ప్రత్యేకమైన వ్యక్తికి.. హెచ్‌బీడీ (HBD) 00.00” అంటూ త్రిష ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. ఇక్కడ ‘00.00’ అని రాయడం ద్వారా.. జూన్ 22 అర్ధరాత్రి 12 గంటలకే తాను విజయ్‌కు అందరికంటే ముందే విషెస్ తెలియజేశానని త్రిష పరోక్షంగా స్పష్టం చేశారు. దీంతో ఆమె విజయ్‌ని అన్‌ఫాలో చేసిందంటూ వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేలిపోయింది.
రాజకీయాల్లోకి వచ్చాక మొదటి బర్త్‌డే
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత జరిగిన మొదటి పుట్టినరోజు కావడంతో ఇటు రాజకీయ వర్గాల నుంచి, అటు సినీ పరిశ్రమ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గత రెండు దశాబ్దాలుగా విజయ్, త్రిష జోడీ వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీపై ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. కాస్త ఆలస్యంగానైనా త్రిష పెట్టిన ఈ క్రేజీ పోస్ట్‌తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

