Dailyhunt
Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

వార్త 1 month ago

Madanapalle crime: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై జరిగిన అమానవీయ హత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read Also:Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

'చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది'

రాష్ట్రంలో చిన్న పిల్లలపై, మహిళలపై వరుసగా జరుగుతున్న దారుణాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, ఇకనైనా మేలుకోవాలని ఆయన 'ఎక్స్' (Twitter) వేదికగా డిమాండ్ చేశారు.

పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారు?

నీరుగట్టువారిపల్లి ఘటన ప్రభుత్వ పనితీరుకు సిగ్గుచేటని జగన్ వ్యాఖ్యానించారు. బాలిక అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, సమయానికి స్పందించి చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారని ఆయన పోలీసు వ్యవస్థను నిలదీశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha