Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మదనపల్లె మార్కెట్లో కుప్పకూలిన టమాటా రేట్లు

మదనపల్లె మార్కెట్లో కుప్పకూలిన టమాటా రేట్లు

వార్త 1 week ago

AP Tomato Prices:టమాటా ధరలు పతనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మార్కెట్లో కూరగాయల రేట్లు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సామాన్యులకు ఊరట లభించినా అన్నదాతలకు తీవ్ర నష్టం కలుగుతోంది.

ముఖ్యంగా ప్రసిద్ధ మార్కెట్ అయిన మదనపల్లెలో టమాటా ధరలు నేలచూపులు చూశాయి. పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వస్తున్న రైతులకు సరైన రాబడి దక్కడం లేదు.

Read also:TG medical health department: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్

 Plummeting tomato prices

మదనపల్లె మార్కెట్లో పడిపోయిన ధరలు

మదనపల్లె మార్కెట్లో శనివారం జరిగిన వ్యాపారంలో పది కేజీల గ్రేడ్ రెండు టమాటా బాక్స్ కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే పలికింది. అంటే మార్కెట్ లెక్కల ప్రకారం కేజీ టమాటా ధర ఏడు రూపాయలకు పడిపోయింది. వ్యాపారులు ఈ ధరకే కొనుగోలు చేస్తుండటంతో కూరగాయల మార్కెట్లలో ధరల పతనం స్పష్టంగా కనిపిస్తోంది.

AP Tomato Prices:రైతుల తీవ్ర ఆవేదన

మార్కెట్లో చెబుతున్న ధర కంటే తక్కువ రేటుకే తమ సరుకు కొంటున్నట్లు రైతులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో కేజీకి మూడు నుంచి నాలుగు రూపాయల యాభై పైసలు మాత్రమే చేతికి అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పొలంలో పంట సాగు చేయడానికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా వెనక్కి రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Epaper: epaper.vaartha.com

ఆగస్టులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha