Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్దూర్​లో జగదీశ్​ రెడ్డి ఫామ్​హౌస్​ను పరిశీలించిన కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ

మద్దూర్​లో జగదీశ్​ రెడ్డి ఫామ్​హౌస్​ను పరిశీలించిన కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ

వార్త 1 week ago

Jagadeeshwar Reddy Farmhouse : మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నాయకుల ఆక్రమణల్లో ఉన్నాయంటూ ఆరోపిస్తున్న భూముల నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనలను వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా నాలుగో రోజు భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూర్ గ్రామంలో పర్యటించింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న ఫామ్‌హౌస్‌ను ఈ బృందం పరిశీలించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు మరియు భూకబ్జాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ నుంచి ప్రత్యేకంగా బస్సులో మద్దూర్‌కు బయలుదేరింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్ నేతలు వేలాది ఎకరాల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

Telangana High Court: BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు!

 Jagadeeshwar Reddy Farmhouse

Jagadeeshwar Reddy Farmhouse : 50 ఎకరాల్లో ఫామ్‌హౌస్.. ఇనామ్ భూముల ఆక్రమణపై ఆరోపణలు

మద్దూర్ గ్రామంలో జగదీశ్‌రెడ్డికి 50 ఎకరాల్లో భారీ ఫామ్‌హౌస్ ఉందన్న కాంగ్రెస్ నేతలు, దానికి సంబంధించిన మ్యాప్‌ను మీడియాకు విడుదల చేశారు. ఈ 50 ఎకరాల ప్రాంగణంలోనే దాదాపు 11 ఎకరాల ఇనామ్ భూములు కలిసి ఉన్నాయని ఆరోపించారు. ఫామ్‌హౌస్ నిర్మాణం కోసం సమీపంలో ఉన్న చెరువు కాల్వలు, ప్రభుత్వ భూములను కాజేశారని కాంగ్రెస్ ప్రతినిధులు మండిపడ్డారు. సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న ఇనామ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని, వాటిని స్థానిక అర్హులైన పేదలకు పంచాలని ప్రభుత్వం తరఫున డిమాండ్ చేశారు. భూమి ఆక్రమణలపై చట్టపరంగా పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిశీలన ముగిసిన అనంతరం నిజనిర్ధారణ బృందం పర్యటన ముగిసింది.

ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. గణేశ్ నిమజ్జన ఆంక్షలపై ఉత్సవ సమితి రచ్చ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha