Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి రక్షణ గోడను (Safety Wall) బలంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘోర ప్రమాదం బియోరాలోని భోపాల్ బైపాస్ వంతెనపై ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
Madhya Pradesh Bus Accident: ప్రయాణికులు కిందపడేలా బస్సు ఢీ.. ప్రమాద తీవ్రత

- ప్రమాద వివరాలు: ఉత్తరప్రదేశ్ నాన్-స్టాప్ ఖాన్ పూర్ నుండి మధ్యప్రదేశ్ ఇండోర్ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సు, వంతెన మలుపు వద్ద అతివేగంతో నియంత్రణ కోల్పోయి గోడను గుద్దింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. పై బర్త్‌లలో నిద్రిస్తున్న ప్రయాణికులు కిటికీల గుండా బయటకు పడిపోయారు.
- బాధితుల తరలింపు: ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రాజ్‌గఢ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బియోరా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భోపాల్ ఆసుపత్రికి తరలించారు.
- మృతుల వివరాలు: రాజ్‌గఢ్ పోలీస్ సూపరింటెండెంట్ (SP) అమిత్ తోలానీ వెల్లడించిన సమాచారం ప్రకారం మరణించిన ఐదుగురిలో:
- బెంగళూరుకు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవి కెపి (45)
- విజయవాడకు చెందిన జ్యోతిరాదిత్య సింగ్
- ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ వికాస్ శుక్లా (29)
- బీహార్ గోపాల్‌గంజ్‌కు చెందిన బెలాల్ అలీ (23)
- ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌కు చెందిన గుడ్డు కుష్వాహా
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు నిర్ధారించారు.
14వ అంతస్తు నుంచి పడినా కేవలం పళ్లు మాత్రమే విరిగాయా?: కోర్టు

