Sadiq Khan Custody Petition : కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ కస్టడీ పిటిషన్‌పై కాకినాడ మొబైల్ కోర్టులో విచారణ జరిగింది.
సాదిక్‌ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వాదనలు విన్నది. నిందితుడి తరఫు న్యాయవాది కస్టడీని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరువర్గాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేశారు. ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఆత్మహత్య ఘటనలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ప్రాణాలు కోల్పోగా, నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుతో పాటు ఆయన అల్లుడు జగదీశ్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. జగదీశ్‌రెడ్డిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు.
Sadiq Khan Custody Petition
Sadiq Khan Custody Petition : పోలీస్ స్టేషన్లలో కేసులు – విచారణ వేగవంతం
ఈ దారుణ ఘటనలకు సంబంధించి రాజమండ్రి టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లలో నిందితుడు సాదిక్ ఖాన్‌పై పలు తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో మరింత సమాచారం సేకరించేందుకు, హత్య మరియు ఆత్మహత్యల వెనుక ఉన్న అసలు కోణాలను వెలికితీసేందుకు సాదిక్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. రైఫిల్ షూటింగ్ కోచ్ అయిన సాదిక్ ఖాన్ తమ కుటుంబాన్ని దారుణంగా నాశనం చేశాడని నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత తనకు ఇంకా భయంగానే ఉందని అతను తెలిపాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడలో దారుణం: వివాహేతర సంబంధం కారణంగా జిమ్ ట్రైనర్ కిరాతక హత్య!

