MP Road Accident Today: మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ (SUV) కారు రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పుట్టినరోజు వేడుకల సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం ఊహించని తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also:Sri Lankan prison: శ్రీలంక జైల్లో డ్రగ్స్ గ్యాంగ్‌ల వీరంగం - ఘర్షణల్లో 25 మంది మృతి
బర్త్‌డే వేడుక ముగించుకుని వస్తుండగా..

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సదరు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక బంధువు పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. వేడుక ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున ఎస్‌యూవీ వాహనంలో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మైహార్ జిల్లా పరిధిలోకి రాగానే నియంత్రణ కోల్పోయిన వీరి వాహనం ముందర ఉన్న భారీ ట్రక్కును వెనుక వైపు నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
MP Road Accident Today:ఒకరి పరిస్థితి విషమం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైహార్ జిల్లా పోలీసులు.. ప్రమాదానికి అతివేగమా లేక డ్రైవర్ నిద్రమత్తే కారణమా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Epaper: epaper.vaartha.com
బెంగాల్‌లో బాలికపై హత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గుంపు!

