హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో రోజంతా సోదాలు
ED raids on AP Liquor Scam : ఏపీ మద్యం కేసు నిందితుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్, ధనుంజయరెడ్డి ఇళ్లల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు సిట్ నివేదిక ఆధారంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడల్లోనూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.
మద్యం ద్వారా వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు రూ.1000 కోట్ల మేర ముడుపులు అందినట్లు గతంలో చేసిన దర్యాప్తుల్లో ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.
Read Also :Hyderabad Auto Drivers Protest: నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు
AP liquor scam: Assets worth Rs. 441 crore seized.
ED raids on AP Liquor Scam: మద్యం కుంభకోణం, మనీలాండరింగ్
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. మద్యం కేసు నిందితులకు సంబంధించిన వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరుపుతోంది. హైదరా బాద్, తిరుపతి, విజయవాడలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు రూ.3,500 కోట్ల వరకు ప్రజాధనం పక్కదారి పట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించింది. సిట్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ మరికొన్ని కీలక విషయాలను గుర్తించింది. మద్యం కుంభకోణంలోని నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించి మనీలాండరింగ్కు పాల్పడినట్లు సంచలన విషయాలను బయటపెట్టింది. నిందితులు నెలకు సగటున వంద కోట్ల రూపాయల చొప్పున అక్రమ వసూళ్లకు పాల్ప డినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు కీలక సమాచారం.
నిధుల మళ్లింపు – రియల్ ఎస్టేట్, బంగారం
మద్యం కేసులో కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో మరోసారి సోదాలు చేపట్టింది. అక్రమంగా సంపాదించిన ముడుపులను నిందితులు కేవలం ఏపీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించారు. అక్రమ నగదును వైట్ మనీగా మార్చడానికి హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రధాన అడ్డాగా మార్చుకున్నారుఓల్విక్, అరోయోఖి, ఈజీలోడ్వంటి డమ్మీ సంస్థల పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధులను మళ్లించారు. తమిళనాడులోని జువెలరీ సంస్థల ద్వారా నగదును బంగారం రూపంలోకి మార్చి భద్రపరిచినట్లు ఈడీ గుర్తించింది.
దర్యాప్తు వేగవంతం, ఆస్తుల జప్తు
సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కింద గత ఏడాది ఏప్రిల్ మే నెలల్లో కేసు నమోదు చేసింది. జులై నెలలో సిట్ ప్రాథమిక ఛార్జిషీటు దాఖలు చేసిన దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసింది. కీలక నిందితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ, తెలంగాణ, దిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాల్లో గత ఏడాది సెప్టెంబరులో ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
ఈ ఏడాది జనవరిలో ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధంనుజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లల్లో ఈడీ సోదాలు జరిపింది. మార్చి నెలలో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు చెందిన 441 కోట్ల రూపాయల మొత్తాన్ని జప్తు చేసింది. మద్యం కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి ఒక్కరికే చెందిన 270 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అయ్యాయి. ఇందులో షాబాద్, జనగామ ప్రాంతాల్లోని రూ..184 కోట్ల విలువైన భూములు ఉన్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

