Hyderabad Auto Drivers Protest: హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు ఒక్కసారిగా రోడ్డెక్కారు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళనలు కొనసాగగా, నేడు ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఎంజే మార్కెట్ చౌరస్తాను ముట్టడించారు.
ఈ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Read Also ; Electric Charging Stations : హైవే పక్కన మీకు స్థలం ఉందా ?
ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్
నిరసన తీవ్రత ఎంతలా ఉందంటే.. ఒక ఆటో డ్రైవర్ తనపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తోటి డ్రైవర్లు, పోలీసులు వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రధాన డిమాండ్లు ఇవే
నగర ఆటో డ్రైవర్లు ప్రధానంగా రెండు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు:
- ఆటో మీటర్లపై ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
- జిల్లా పర్మిషన్ ఉన్న ఆటోలతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు నగరంలో ఆటోలు నడుపుతుండటం వల్ల స్థానిక డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆటోలకు నగరంలో అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ జామ్: వాహనదారుల అవస్థలు
గంటకు పైగా ఎంజే మార్కెట్ చౌరస్తాలో ధర్నా కొనసాగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

