Suryapet Accident: సూర్యాపేట జిల్లా కోదాడలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. జూన్ 30వ తేదీన ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం తాగేందుకు వెళ్లారు.
అయితే, మద్యం మత్తులో ఉన్న సమయంలో వారి మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఈ క్రమంలో రమేష్, మహేష్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది.
రమేష్, మహేష్ పరస్పరం ఘర్షణ పడుతుండటాన్ని గమనించిన మూడో స్నేహితుడు యాకూబ్ రంగంలోకి దిగాడు. వారిద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు, సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహేష్.. గొడవ ఆపబోయిన యాకూబ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యాకూబ్‌ను మహేష్ వెనుక నుండి గట్టిగా కాలితో తన్నాడు.
Read Also: Andhra Pradesh Crime: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య
Drunken brawl: Youth dies after being kicked and falling under a lorry.
Suryapet Accident: లారీ కింద పడి దుర్మరణం.. సీసీటీవీలో అసలు నిజం
మహేష్ బలంగా తన్నడంతో యాకూబ్ రోడ్డుపై తన నియంత్రణను కోల్పోయి, అదే సమయంలో వేగంగా వెళ్తున్న లారీ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో యాకూబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ యాకూబ్ మృతి చెందాడు. మొదట ఈ ఘటనను పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించడంతో అసలు నిందితుడు మహేష్ అని తేలింది. మహేష్ కాలితో తన్నడం వల్లే యాకూబ్ లారీ కింద పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు మహేష్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.
Epaper: epaper.vaartha.com

