Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యంలోకి నీళ్లు కలపలేదని బాలుడిని కాల్చి చంపిన కిరాతకుడు!

మద్యంలోకి నీళ్లు కలపలేదని బాలుడిని కాల్చి చంపిన కిరాతకుడు!

వార్త 1 month ago

UP Crime news: ఉత్తరప్రదేశ్‌ కాస్‌గంజ్ జిల్లాలో ఒక శుభకార్యం విషాదంగా మారింది. మద్యం మత్తులో ఉన్న ధనేష్ యాదవ్ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయాడు.

తాగడానికి నీళ్లు అడిగినప్పుడు ఆ పిల్లాడు తీసుకురావడంలో ఆలస్యం చేశాడని కోపంతో ఊగిపోయాడు. వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీ తీసి తొమ్మిదేళ్ల బాలుడిపై తూటాల వర్షం కురిపించాడు.

Read also: Aman Kumar Sharma Judge Suicide: దిల్లీ జడ్జి సూసైడ్ మిస్టరీ: IAS అధికారి వేధింపులే కారణమా?

 UP Police arrest man for shooting boy

UP Crime news: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి

తుపాకీ గుండు తగిలి రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో పోరాడుతూ ఆ చిన్నారి శనివారం కన్నుమూశాడు. బారసాల వేడుక కోసం వచ్చిన అతిథులంతా ఈ ఘోరాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఒక చిన్న కారణానికి నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు ధనేష్ యాదవ్‌ను పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని స్వాధీనం చేసుకుని అతనిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు. వేడుకల్లో ఇలాంటి మత్తులో చేసే అరాచకాలు పెరిగిపోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ విచారణ వేగవంతం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha