Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహాలక్ష్మి కార్డు ఫేక్:ప్రభుత్వం!

మహాలక్ష్మి కార్డు ఫేక్:ప్రభుత్వం!

వార్త 2 weeks ago

Mahalaxmi Smart Card Telangana: హైదరాబాద్: సోషల్ మీడియాలో మహాలక్ష్మి పథకం స్మార్ట్ కార్డులపై జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెలంగాణ ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసింది.

జూన్ 2వ తేదీ నుండి రూ. 50 ల రుసుముతో ఈ పథకానికి ప్రత్యేక స్మార్ట్ కార్డ్‌లు జారీ చేస్తారంటూ చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అయితే, భవిష్యత్తులో రాబోయే ఒకే ఒక్క మల్టీ-పర్పస్ కార్డ్‌తోనే ఈ సేవలు అందనున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘ఇంటిగ్రేటెడ్ కార్డ్స్’ లోనే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచనుంది. ఈ ఇంటిగ్రేటెడ్ కార్డ్ అనేది ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, సేవలను ఒకే గొడుగు కిందికి తెచ్చే సరికొత్త విధానం. భవిష్యత్తులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి వేరే ఏ ఇతర ప్రత్యేక కార్డులు అవసరం లేకుండా, ఈ ఒక్క ‘ఇంటిగ్రేటెడ్ కార్డ్’ ద్వారానే ప్రయాణించే అద్భుత సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ చిత్రం ప్రభుత్వ అధికారిక డిజైన్ కాదు. అది కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా ఎవరో సృష్టించిన నమూనా మాత్రమే. ఈ కార్డుల జారీ ప్రక్రియ, వాటి విధివిధానాలు, ప్రారంభ తేదీ లేదా దానికి అయ్యే ఖర్చుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు మరియు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కొత్త కార్డుల(Mahalaxmi Smart Card Telangana) జారీ ప్రక్రియ మరియు విధివిధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు మహిళలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం మహిళలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. మహిళా ప్రయాణికులు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను నిర్వహణ సిబ్బందికి చూపించి ఎప్పటిలాగే ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందులో ఎలాంటి మార్పు లేదు.

పూర్తిస్థాయిలో ఖరారు కాని సమాచారాన్ని, ఇలాంటి అనధికారిక నమూనాలను నమ్మవద్దని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరఫున ఈ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కార్డ్ ప్రాజెక్ట్ ఖరారైన వెంటనే, దానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించడం జరుగుతుంది. అప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha