Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి!

మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి!

వార్త 2 weeks ago

Collector K Haritha: ఆసిఫాబాద్, మే 30: బాలికలు, మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.

హరిత పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO) దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) సీతారాం, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి ప్రమీలలతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, బాలికల రక్షణ మరియు హక్కుల కోసం అనేక చట్టాలను తీసుకువచ్చాయని గుర్తు చేశారు. సమాజంలో మహిళలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, అందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలికలు చట్టాలను గౌరవించడంతో పాటు, సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు తాము చదువుకునే పాఠశాలలను దేవాలయాలుగా భావించి ఉన్నత లక్ష్యాల వైపు సాగాలన్నారు.

 District Collector K. Haritha is being mocked

Collector K Haritha: ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘ఉల్లాస’ (పుల్లాస్) కార్యక్రమంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. సిర్పూర్ (యు) మండల కేంద్రానికి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు మెస్రం జిజాబాయి ఈ వయసులోనూ ఉల్లాస పరీక్ష వ్రాసి ఘనంగా ఉత్తీర్ణత సాధించారు. చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించిన జిజాబాయిని కలెక్టర్ కె. హరిత ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి, సర్టిఫికేట్ అందించి అభినందించారు. అనంతరం మాక్ పార్లమెంట్ ప్రదర్శన ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha