Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ లేఖ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ లేఖ

వార్త 2 weeks ago

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రెండు కీలక అడుగులు వేశారు. ఉత్తర తెలంగాణ సాగు, తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవడంతో పాటు, రాష్ట్రంలో ఇంటర్నెట్ విప్లవం కోసం కేంద్రమంత్రితో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

 virtual meeting with jyotiraditya scindia

తుమ్మిడిహట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సీఎంకు లేఖ

ఉత్తర తెలంగాణ జిల్లాల నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా తుమ్మిడిహట్టి బ్యారేజీ అంశంపై చర్చలు జరిపేందుకు సమయం ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయనకు ఒక అధికారిక లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ఈ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందానికి తగిన తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని కోరారు. ఎఫ్ఆర్ఎల్ పెంపు అవసరం గతంలో అంగీకరించిన 148 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) వల్ల తెలంగాణకు ఆశించిన ప్రయోజనం ఉండదని, దానిని పెంచితేనే గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తు పెంచినప్పటికీ మహారాష్ట్రలో ముంపు ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని లేఖలో వివరించారు.

Read also: TDP : తెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ ఫోకస్!

Revanth Reddy: టీ-ఫైబర్ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో సాగుతున్న ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో చర్చకు వచ్చిన ప్రధానాంశాలు:

అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ కింద తెలంగాణకు రావలసిన పెండింగ్ నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. మండలం నుంచి గ్రామ పంచాయతీల వరకు ఉన్న రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను ‘డిజిటల్ భారత్ నిధి’కి బదిలీ చేయడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించడంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సింధియా సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఫామ్ హౌస్ కు బండి భగీరథ్.. సీన్ రీకన్స్ట్రక్షన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha