Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫామ్ హౌస్ కు బండి భగీరథ్.. సీన్ రీకన్స్ట్రక్షన్

ఫామ్ హౌస్ కు బండి భగీరథ్.. సీన్ రీకన్స్ట్రక్షన్

వార్త 2 months ago

Bandi Bhageerath : తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బుధవారం ఉదయం చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకుని, కోర్టు అనుమతితో భగీరథ్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన అనంతరం భగీరథ్‌కు తొలుత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత భారీ భద్రత నడుమ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని 'అరణ్య ఫామ్‌హౌస్'కు తరలించారు. ఒక మైనర్ బాలికపై ఈ ఫామ్‌హౌస్‌లోనే లైంగిక దాడి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, నేరం జరిగిన తీరును విశ్లేషించేందుకు (సీన్ రీకన్‌స్ట్రక్షన్) దర్యాప్తు బృందం నిందితుడిని నేరుగా ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించింది.

Read Also : భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు.. ఆధారాల సేకరణపై సిట్ దృష్టి

ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), బాధితురాలితో పాటు ఆమె తల్లి ఇచ్చిన అధికారిక స్టేట్‌మెంట్‌ల ఆధారంగా విచారణను వేగవంతం చేసింది. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఫామ్‌హౌస్‌కు పిలిపించి, ఒత్తిడి చేసి మద్యం తాగించిన అనంతరం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియలో భాగంగా ఘటన జరిగిన రోజు ఏం జరిగిందనే అంశాలపై భగీరథ్‌ను పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రశ్నించారు. ఇప్పటికే భగీరథ్ స్నేహితులు నలుగురిని విచారించిన పోలీసులు.. ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ లొకేషన్ ఆధారాలు, ఇతర సాంకేతిక సాక్ష్యాలను సేకరిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ గడువులోగా మరిన్ని కీలక విషయాలను రాబట్టి, కోర్టు ముందు పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్‌లో నీళ్లు వృథా చేస్తే రూ. 10 వేలు జరిమానా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha