Dailyhunt
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

వార్త 1 week ago

Ananthapur: శింగనమల ఏప్రిల్ 06 ఈనెల 10 తేదీ నుండి12వ తేదీ వరకు అనంతపురం నుండి బండ్లపల్లి వరకు జరిగే పాదయాత్రను.భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి చిన్నప్ప యాదవ్ పిలుపునిచ్చారు.

సోమవారం మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పాదయాత్ర గోడ పత్రికలను సింగనమల సిపిఐ విడుదల చేశారు.

Read also: Undavalli Arun Kumar: కూటమి విడిపోతే జగన్ దే విజయం: ఉండవల్లి

CPI leaders releasing posters for MGNREGA padayatra in Singanamala.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ పేద కూలీలకు చిన్న చిన్నకారు రైతులకు బాసటగా ఉన్న మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో ఎలాంటి హక్కులు లేనటువంటి వి బి జి రామ్ జి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ఉపాధి పథక చట్టాన్ని తూట్లు పొడిచింది కేంద్ర ప్రభుత్వం అని గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించేది కొత్తగా తెచ్చిన చట్టం వలన రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Ananthapur: పాదయాత్రకు తరలిరావాలని నేతల పిలుపు

కావున ఈ అంశాల పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మూడు రోజులు పాటు జరిగే ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి అనంతపురం మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి జగదీష్,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, సిపిఐ జిల్లా కార్యదర్శులు పాల్యం నారాయణ స్వామి,వేమయ్యయాదవ్,మరియు జాతీయ రాష్ట్రస్థాయి జిల్లా కమ్యూనిస్టు పార్టీనాయకులు శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు కావున ఉపాధి శ్రామికులు కర్షకులు అందరు పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన గళం

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మధుయాదవ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు చేనేత మధు,చికెన్ భాష, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మునుస్వామి,సిపిఐ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నారప్ప, మరియు రామ సుబ్బారెడ్డి, రూప్ల నాయక్, జయరాం నాయక్, రవిరెడ్డి,దస్తగిరి, ఆదినారాయణ, హనుమప్ప, రామాంజి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు 'X' కేటగిరీ భద్రత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha