Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహబూబ్ నగర్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మహబూబ్ నగర్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

వార్త 2 weeks ago

International Yoga Day 2026: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మహబూబ్ నగర్ బ్యూరో జూన్ 21 ప్రభాతవార్త యోగా మన పూర్వీకుల దైనందిన జీవితంలో కీలక భాగమై ఉండగా, నేడు అదే యోగాను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనుసరిస్తున్నాయని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయూష్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరంలోని పిల్లల మర్రిలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయన మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన యోగా సంప్రదాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఐక్యరాజ్యసమితి లో ఆమోదించిన తీర్మానం కీలకమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన యోగా తీర్మానానికి 193 దేశాల్లో 177 దేశాలు మద్దతు ఇవ్వడం యోగాకు ఉన్న విశ్వవ్యాప్త ప్రాధాన్యతను తెలియజేస్తుందని చెప్పారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కూడా పరిశోధనల ద్వారా నిరూపించారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యత పెరిగినప్పటికీ, మనం దానిని ప్రతిరోజూ ఆచరించడంలో కొంత వెనుకబడుతున్నామని అభిప్రాయపడ్డారు.

Read also: Fathers Day 2026: హ్యాపీ ఫాదర్స్ డే!

International Yoga Day 2026: ఒత్తిడిని జయించే అద్భుత సాధనం

బిజీ జీవితంలో కనీసం రోజుకు 30 నుంచి 40 నిమిషాలు యోగా, ప్రాణాయామం లేదా ధ్యానం కోసం కేటాయిస్తే శరీరానికి, మనసుకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. మన పూర్వికులు అందించిన ఈ అమూల్యమైన సంపదను కాపాడుకుంటూ, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. యోగ దేశ సంస్కృతి.. యోగ భారతదేశ గొప్ప సంస్కృతి అని, యోగాతో ఆరోగ్యం ఏకాగ్రత మానసిక ఉల్లాసం కలిగిస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట యోగ చేయాలని, దీంతో అనేక ఒత్తిడిలను అధిగమించవచ్చన్నారు. 26న నషా ముత్తు భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని, డ్రగ్స్ బారిన పడితే జీవితం నాశనం అవుతుందని, యువత ఏ దేశ భవిష్యత్తు కాబట్టి యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజులు రెడ్డి, బిజెపి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, బిజెపి కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సదాశివపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha