Dailyhunt
మహిళా బిల్లుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ర్యాలీలు

మహిళా బిల్లుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ర్యాలీలు

వార్త 1 week ago

BJP PVN Madhav: చట్టసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతుగా కూటమిలోని పార్టీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు దేవడుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడించారు.

ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో ర్యాలీలు, సథలు నిర్వహిస్తామన్నారు. అలాగే వాల్ రైటింగ్, సిగ్నేచర్ క్యాంపులు, మిస్ట్ కాల్స్ ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రజల మద్దతు కూడగడ తామని చెప్పారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో పార్లమెంట్లో జరిగే చర్చల్లో చట్ట సభల్లో మహిళ బిల్లు ఆమోదం పొందుతుందని మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: Vijayawada Terror Case Investigation: ఉగ్ర లింకుల కేసు.. నిందితుల విచారణలో కీలక విషయాలు

 Legislative bodies women reservation bill bjp support programs

BJP PVN Madhav: 2029 నాటికి పూర్తి స్థాయిలో అమలు

ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తామని ప్రకటించారు. 2029 నాటికి మహిళా బిల్లు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో బిజెపిదీ కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలని భావించే మహిళలు బిజెపిలోకి రావాలని పిలుపు నిచ్చారు. ఏ పార్టీ అయినా గెలుపు కోసం పనిచేస్తుందని, నాయకులు తయారు కావాల్సి ఉందన్నారు. 2029 నాటికి జన గణన, లిమిటేషన్, మహిళా బిల్లు అన్నీ పూర్తవుతాయని ఎపి బిజెపి చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. మొదటి
నుంచీ మహిళలకు బిజెపి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

కాంగ్రెస్ వైఖరిపై పివిఎన్ మాధవ్ ఆగ్రహం

సెప్టెంబర్ 23వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళలు రెండు శాతం ఉండే పరిస్థితి నుంచి.. నేడు వంద మందిపైగా ఉన్నారని వివరించారు. దేవెగౌడ ఆధ్వర్యంలో మహిళా బిల్లు పెట్టినా సభలో ఆమోదం పొందలేదని పేర్కొన్నారు. మహిళా బిల్లు లోక్సభలోకి రాకుండా నిలిపి వేసిందంటూ కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా పిబిఎన్ మాధవ్ నిప్పులు చెరిగారు. మోదీ సారథ్యంలో లోక్ సభ, రాజ్యసభల్లో మహిళా బిల్లుకు పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ బిల్లును సవరణ చేసుకుని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానున్నారని వివరించారు. మహిళలు, పురుషులు అన్ని రంగాల్లో సమానం గా రాణించాలనేదే బిజెపి అభిప్రాయమన్నారు.

నారీ శక్తి వందన్ ఆక్ట్ – మోదీ చొరవ

ఈ బిల్లుకు అంతా పూర్తి మద్దతు ఇచ్చేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. సభను కాంగ్రెస్ పార్టీ వాయ్ కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఉన్నా.. మహిళా బిల్లుకు పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఆమోదం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మోడీ నేతృత్వంలో నారీ శక్తి వందన్కు పూర్తి ఆమోదం వచ్చేలా చేశారని వివరించారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు సభ్య సమాజంతో పాటు ఎవరూ అంగీకరించరని పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. రాజకీయాల్లో ఇరాంటి నాయకులు ఉండకూడదని అభిప్రాయ పడ్డారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత దిగజారుడు విధంగా మల్లికార్జున్ ఖర్గే తీరు ఉందంటూ మండిపడ్డారు.

మహిళా మోర్చా హర్షం – సంక్షేమ పథకాలపై ప్రశంసలు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించిన సందర్భంగా దేశంలోని మహిళా లోకం తరఫున ప్రధాని మోడీకి ఎపి మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు ధన్యవాదాలు తెలిపారు. చట్టసభల్లో మూడో వంతు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయి, రాణీ రుద్రమదేవి వంటి ఎంతో మంది నారీ మణులను స్ఫూర్తిగా తీసుకుని ఈ రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నామని చెప్పారు.

మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముద్ర యోజన వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. స్టాండప్, స్టార్టవ్ ఇండియాలో 84 శాతం మహిళలే ఉన్నారని నిషితా రాజ్ గుర్తు చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముద్దు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బాంటి చాలా మందికి ప్రధాని మోదీ అవకాశాలు కల్పించారని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మహిళలకు భద్రత కల్పించారని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్ అందించారని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ నినాదంతో ప్రపంచంలో తొలి స్థానంలో భారత్ నిలబడేలా మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హెల్మెట్ పెట్టుకుని నడుపుతా".. ప్రయాణికులతో బస్సు డ్రైవర్ వెటకారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha