Vijayawada Terror Case Investigation: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసు కస్టడీలో నిందితుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఆరుగురు నిందితులను వేర్వేరు గదుల్లో పోలీసులు, సీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేశారు. నిందితుల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. భవిష్యత్తులో ముజాహిద్దీన్లుగా మారేందుకు కూడా తాము సిద్ధపడ్డామని నిందితులు వెల్లడించారు.
Read Also: Census 2027: జనగణనకు ప్రజలు సహకరించాలి
Key turning point in Vijayawada terror links case
Vijayawada Terror Case Investigation: ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యం
వారందరి నోట భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచననే కీలమనే మాట వెల్లడైంది. లక్ష్య సాధన కోసం ఆత్మాహుతి దాడులకు సిద్ధపడాలని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాము జిహాదీ భావజాలానికి ఆకర్షితులయ్యామని సామాజిక మాధ్యమాల్లో ఆ విషయాలకు సంబంధించి విస్తృతంగా పోస్టులు పెట్టామని నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు కృషి చేయాలంటూ విదేశీ హ్యాండర్ల నుంచి వచ్చిన పిలుపు మేరకు తాము తీవ్రవాద భావజాలం వైపు మళ్లమని వారు అధికారులకు వివరించారు.
ముజాహిద్దీన్లుగా మారేందుకు మరికొన్ని నెలల్లో పాకిస్థాన్కు వెళ్లాలని కూడా తాము నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. విదేశీ హ్యాండ్లర్లు ఎలా పరిచయం అయ్యారు? వారు మిమ్మల్ని ఎలా ప్రేరేపించారు? అని నిందితులను పలు రకాలుగా ప్రశ్నించారు. బెనెక్స్ గ్రూప్ను ఎందుకు ఏర్పాటు చేశావు? ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశావని ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్పీ అధికారులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సోషల్ మీడియాలో ఐసిస్ జెండాను ఎగురవేయడం, ఉగ్రవాదుల చిత్రాల్లో తన తల వరకు పెట్టుకున్న వాటిని ఎందుకు పోస్టు చేశావని పోలీసులు అతడ్ని అడిగారు.
లక్కీ అహ్మద్ వెల్లడించిన సంచలన నిజాలు
తమ లక్ష్యాలను సాధించేందుకు ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని లక్కీ అహ్మద్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. తనకు సోషల్ మీడియాలో షుకూర్ పరిచయం అయ్యాడనీ చెప్పాడు. అతను ప్రేరేపించడంతోనే తాను నిత్యం సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదానికి సంబంధించినవి పోస్టులు పెట్టేవాడినని లక్కీ అహ్మద్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. సమాచారం. ఈ కేసులో విజయవాడలోని ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించడంతో పాటు జిహాద్ సిద్ధత కోసం యువతను ప్రేరేపించడంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించారు, వారితో వీరికి ఉన్న సంబంధాలు, విదేశీ హ్యాండ్లర్ల ఎవరూ అన్న విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి.
దర్యాప్తులో అంతర్రాష్ట్ర లింకులు
ప్రస్తుతం విజయవాడ, ఢిల్లీ, జోధ్పూర్ వంటి ప్రాంతాల మధ్య టెర్రరిస్టు సంబందాలున్నట్లు గుర్తించారు.
ఉగ్రలింకుల కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తు చర్యల్లో కీలకంగా మారింది. ఉగ్రవాద చర్యలను నిరోధించేందుకు, యువతలో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడాన్ని అరికట్టేందుకు ఈ దర్యాప్తు కీలకంగా భావిస్తున్నారు. ఉగ్రలింకులు కేసులో అరెస్టు అయిన మైనర్ రిమాండ్ను ఈనెల 24 వరకు పొడిగించారు. అతడి కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జూన్ 13కి వాయిదా పడింది. మైనర్కు సంబంధించిన విచారణ కూడా ఉగ్రవాద కార్యకలాపాల చివరి విడత నిందితుల విచారణలో కీలకం కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
విదేశీ నిధుల పేరుతో రూ. 3 కోట్ల వసూలు.. వైసీపీ నాయకుడిపై కేసు!

