Bindu Krishna MLA: మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. ఆకాశమే తమ సరిహద్దుగా దినదినం వృద్ధిచెందుతున్నారు. తోపుడు బండిలను నడిపే స్థాయి నుంచి విమానాలను నడిపేస్థాయికి చేరుకుంటున్నారు.
సైన్యంలో చేరి, తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇక రాజకీయాల్లో వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. అయినా ఎక్కడో ఒకచోట ఆమెకు అవమానాలు, లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో ఒక మహిళా ఎమ్మెల్యేకు ఓ ఇబ్బందిక పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఆమె తన పార్టీ అభిమానులను కలిసేందుకు వస్తున్న క్రమంలో సొంతపార్టీ నేత కనీస విచక్షణ లేకుండా ఆమెను బలవంతంగా కౌగిలించుకోబోయాడు. అతడి ప్రవర్తనకు కంగుతిన్న ఆమె బలవంతంగా అతడిని వదిలించుకొని లోపలికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అయ్యింది.
Read Also:Tamil Nadu Politics: కాంగ్రెస్‌కు DMK గుడ్ బై.. ఇండియా కూటమి నుంచి స్టాలిన్ అవుట్!
Bindu Krishna MLA: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జరిగిన ఘటన
కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించిన విషయం
తెలిసిందే. కొల్లాం నియోజకవర్గం నుంచి బిందు కృష్ణ అనే మహిళ విజయం సాధించారు. ఈ క్రమంలో పార్టీ
సమావేశంలో భాగంగా ఆమె తిరువనంతపురంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆ
దారిలో ఉన్న సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ను ఆమె మర్యాదపూర్వకంగా పలకరించగా.. ఆయన మానరతం
ఆమెను బలవంతంగా కౌగిలించుకోబోయాడు. ఆమె ఇబ్బందిపడుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఆమే
ఆయనను వదిలించుకొని కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
కాగా నెటిజన్లు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మ్యాజిక్ ఫిగర్ సాధించిన TVK.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్!

