Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మ్యాజిక్ ఫిగర్ సాధించిన TVK.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్!

మ్యాజిక్ ఫిగర్ సాధించిన TVK.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్!

వార్త 3 months ago

Tamil Nadu: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు అదృష్టం వరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని ఆయన సాధించారు.

మిత్రపక్షాల మద్దతుతో టీవీకే బలం మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవడంతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది.

Read Also:Kerala Election Results: మల్లిఖార్జున్ ఖర్గేతో ఎంపీ శశిధరూర్ భేటీ

మ్యాజిక్ ఫిగర్ 118 రీచ్‌!

తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇటీవల వెలువడిన ఫలితాల్లో టీవీకే ఒంటరిగా గెలిచిన స్థానాలతో కలిపి మొత్తం 112 మంది ఎమ్మెల్యేల బలం విజయ్‌కు ఉంది. మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజాకు ఫోన్​ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. వీసీకే అధినేతకు సైతం కాల్ చేసిన ఖర్గే. టివీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి. సీపీఐ (CPI) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీఎం (CPM) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు తెలపడంతో విజయ్ శిబిరంలో ఆనందం నెలకొంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే బలం ఖచ్చితంగా 118కి చేరుకుంది.

త్వరలో గవర్నర్‌తో భేటీ

మూడో సారి 4:30 గంటలకు గవర్నర్ ను కలవనున్న విజయ్. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి, ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తున్న తరుణంలో.. ఈ మెజారిటీ లభించడం విజయ్ రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

"ఓడినా భయపడకండి.. విజయం మీ వెంటే!".. వైరల్ అవుతున్న టీవీకే అధినేత పోస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha