Pedda Shankarampet: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ కడుపులోని దాదాపు మూడు కిలోల కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు పెద్దశంకరంపేటలోని పద్మాలయ ఆసుపత్రి వైద్యులు రజిని, శ్రీనివాస్ తెలిపారు.
మండల పరిధిలోని మూసాపేట గ్రామానికి చెందిన సాయమ్మ (40) గత ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం ఆమె పద్మాలయ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు స్కానింగ్ నిర్వహించి పరిశీలించగా కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు.
Pedda Shankarampet: దీంతో ప్రముఖ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించి, కడుపులో ఉన్న దాదాపు మూడు కిలోల కణితిని విజయవంతంగా తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పద్మాలయ ఆసుపత్రి వైద్యులు రజిని, శ్రీనివాస్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం సాయమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

