Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా పోలీసుల ముందే బట్టలు ఎందుకు విప్పాలి? సీతక్క ఆగ్రహం

మహిళా పోలీసుల ముందే బట్టలు ఎందుకు విప్పాలి? సీతక్క ఆగ్రహం

వార్త 3 weeks ago

Seethakka: మంగళవారం శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ గేట్ల వద్ద మహిళా పోలీసుల సమక్షంలో నిరసనల పేరుతో బట్టలు విప్పుకుని నిరసన తెలపాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె నిలదీశారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు.

స్పీకర్‌ను దూషించడంపై కఠిన చర్యలకు డిమాండ్

సభాపతి స్థానంలో ఉన్న స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు దూషించడాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. సభా మర్యాదలను మంటగలిపేలా ప్రవర్తించిన సదరు సభ్యులను కఠినంగా శిక్షించాలని సభలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు వాడిన భాష అత్యంత అభ్యంతరకరంగా ఉందని, సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Seethakka: మహిళా ఎమ్మెల్యేలు మరియు పోలీసులపై చర్యలు

మహిళా ఎమ్మెల్యేలపై ఏ రూపంలో దాడి జరిగినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు. అంతేకాకుండా, విధుల్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా లేదా దురుసుగా ప్రవర్తించిన పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

కోకాపేటలో BRS ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha