CM Revanth Reddy: మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన సీఎం.. ఈ దేశంలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, మహిళా సాధికారతకు నాంది పలికిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ స్ఫూర్తితోనే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also : CM Revanth Reddy: కొడంగల్ రూపురేఖలు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి
We will not tolerate politics under the guise of women’s reservation: Revanth Reddy
CM Revanth Reddy: సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారం..
భారతదేశానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెలికాం విప్లవాన్ని పరిచయం చేసి ప్రపంచ పటంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానాలే నేడు దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతానికి, గాంధీ కుటుంబానికి మధ్య దశాబ్దాల కాలంగా ఒక అవినాభావ సంబంధం ఉందని, అది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదని.. కుటుంబ సంబంధాల కంటే ఎంతో పవిత్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు.
కోట్లాది మంది ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి, సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ గడ్డపై తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఇక్కడి ప్రజలు గాంధీ కుటుంబం చేసిన త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తిగా రాజీవ్ గాంధీ ఆశయాలు, స్ఫూర్తితోనే ప్రజాక్షేమం మరియు సంక్షేమం కోసం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
అర్ధరాత్రి మద్దిమడుగులో భారీ అగ్నిప్రమాదం.. ఐదు షాపులు పూర్తిగా దగ్ధం!

