Dailyhunt
మహిళా సాధికారతకు చారిత్రాత్మక బాట.. పల్లవి కాలేజీలో ఘనంగా సాండ్ ఆర్ట్ ప్రదర్శన

మహిళా సాధికారతకు చారిత్రాత్మక బాట.. పల్లవి కాలేజీలో ఘనంగా సాండ్ ఆర్ట్ ప్రదర్శన

వార్త 5 days ago

Narishakti Vandan Adhiniyam: నారీశక్తి వందన్ అధినియం ద్వారా దేశంలోని మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతోంది. మహిళా సాధికారత కోసం గత 30 సంవత్సరాలకు పైగా దేశ మహిళలు ఎదురుచూస్తున్న ఈ ముఖ్యమైన డిమాండ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గారు నెరవేర్చుతున్నారు.

Read Also:BRS Party Joinings: మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

2023లో చట్టంగా మారిన నారీశక్తి వందన్ అధినియం, రాజ్యాంగ సవరణ ద్వారా 2029 నుండి అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇది దేశ మహిళల సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం.

 Narishakti Vandan Adhiniyam 2026

Narishakti Vandan Adhiniyam: పల్లవి కాలేజీలో సాండ్ ఆర్ట్ సందడి

ఈ సందర్భంగా, ఈరోజు పల్లవి కాలేజీలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య గారు మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సాండ్ ఆర్ట్ కార్యక్రమంలో పాల్గొని, మహిళల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

దేశ మహిళలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గారు అందించిన ఈ అమూల్యమైన బహుమతి సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర మహిళల తరఫున, అలాగే రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తొమ్మిదేళ్ల బాలికను రక్షించిన సాహసవంతులకు నగర సీపీ సజ్జనర్ సన్మానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha