Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా సంఘాలకు రూ.2.18 కోట్ల రుణాలు.. రామాయంపేటలో ఘన లోన్ మేళా

మహిళా సంఘాలకు రూ.2.18 కోట్ల రుణాలు.. రామాయంపేటలో ఘన లోన్ మేళా

వార్త 2 months ago

Women Welfare Schemes : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 25 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రామాయంపేట పురపాలక సంఘంలో లోన్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు.

19 స్వయం సహాయక సంఘాలకు రూ.2.18 కోట్ల రుణాలు

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్ చేతుల మీదుగా 19 స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.2 కోట్ల 18 లక్షల బ్యాంకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు.

Read also: AP Noise Pollution: ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!

 Women Welfare Schemes

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మెప్మా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వక్తలు సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం.. మంతెన రామరాజు సంచలన ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha