Ammaku Aksharamala Program Telangana: మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే దృక్పథంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మకు అక్షరమాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఫలితాలను అందిస్తోంది.
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆదరణ పొందుతోంది. చదువుకోలేక వెనుకబడిన మధ్యవయసు, వృద్ధ మహిళలకు మరోసారి విద్యా అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కుటుంబ బాధ్యతల వల్ల చదువు మధ్యలో ఆగిపోయిన మహిళలు తిరిగి పుస్తకాలు పట్టడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది.
Read Also:Amanagallu crime:భార్య, కొడుకును చంపి.. కూతురిని ఆసుపత్రి పాలు చేసిన తండ్రి
Ammaku Aksharamala Program Telangana: Search special measures to increase literacy among women
గ్రామ స్థాయిలోనే ఎస్ హెచ్సిల ఆధారంగా తరగతులు నిర్వహించడం వల్ల మహిళలు సౌకర్యవంతంగా పాల్గొనే వాతా వరణం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,01,357 మంది మహిళలు అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో చదువు నేర్చుకునేందుకు ఆదివారం నిర్వహించిన అక్షరాస్యత పరీక్షకు 6,31,656 మంది హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ లేదా మేలో వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారు పదో తరగతి పరీక్షలకు హజరు కావచ్చు. ఒక్కో గ్రామంలో 40 నుంచి 60 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించి, వారికి స్థానికంగా 8 నుంచి 10 మంది వలంటీర్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధనా విధానం మహిళలు చాలా సులభంగా నేర్చుకునే విధంగా ఉంది.
16 వారాల శిక్షణ కార్యక్రమం 2025 అక్టోబర్లో ప్రారంభమైంది. నోటుబుక్స్, ప్రాథమిక అభ్యాస సాధనాలను ఉచితంగా అందచేశారు. గుర్తులు, చిత్రాలు, తెలిసిన అంశాలను ఉపయోగించి అక్షరాస్యతకు సంబం ధించిన ప్రాథమిక భావాలను సులభంగా అర్థమ య్యేలా బోధించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వయోజన విద్యాశాఖతో సమన్వయం చేస్తూ అమలు చేశారు. వలంటీర్లు, ఫెసిలిటేటర్లకు వివిధ స్థాయిల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల సాధికార తకు అక్షరా స్యతే కీలకమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి మహిళ చదువుకోవాలనే లక్ష ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్షరానికి మించిన ఆయుధం లేదు. చదువు ద్వారా మహిళలు తమ జీవితాలను స్వయంగా మార్చుకునే శక్తిని పొందుతారు” అని ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

