Pedda Shankarampet Crime: ఓ మహిళను మోసపూరితంగా ఆటోలో ఎక్కించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఎస్సై ప్రవీణ్ రెడ్డి కథనం మేరకు వివరాల్లో కి వెళ్తే …మండల పరిధిలోని కమలాపూర్ గ్రామానికి చెందిన అంబమ్మ శనివారం ఉదయమే తమ్ముడు గోపాల్ ను కలవడానికి కల్హేర్ మండలం బాచేపల్లి కి వెళ్లి సాయంత్రం శంకరంపేటకు తిరిగి వచ్చింది. సాయంత్రం సుమారు 6:30 గంటలకు స్థానిక వైన్స్ షాప్ పక్కన ఆటో స్టాండ్ వద్ద కమలాపూర్ వెళ్లేందుకు వేచి ఉంది.
Read Also: Inter results 2026 : జోగిపేట SRM కళాశాల ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం
Gold Robbery
Pedda Shankarampet Crime: అసలేం జరిగింది?
ఈ క్రమంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆటోలు వచ్చి నిజాంపేట వైపు వెళ్తున్నామని కమలాపూర్లో దింపుతామని చెప్పడంతో ఆమె వారి మాటలు నమ్మి ఆటోలో ఎక్కింది. ఆటో కమలాపూర్ దాటిన తర్వాత కూడా ఆపకపోవడంతో బాధితురాలు అనుమానం వ్యక్తం చేయగా, నిందితులు ఆమె నోరును మూసి గ్రామ పరిసర ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు.
అదేవిధంగా కాళ్లకు ఉన్న కడియాలను కూడా తీసుకున్నందుకు ప్రయత్నించగా విఫలమై బాధితురాలిని అక్కడే వదిలేసి ఆటోలు నిందితులు పరారయ్యారు. ఈ ఘటనలో బాధితురాలికి వెన్ను, కాళ్లకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
పుల్కల్‌లో అగ్నిప్రమాదం: ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి భరోసా

