Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళను వేధించిన సైకో అరెస్ట్

మహిళను వేధించిన సైకో అరెస్ట్

వార్త 3 months ago

Harassing Woman In Alkapur Township : హైదరాబాద్‌ మహానగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అల్కాపూర్ టౌన్‌షిప్‌లో గత కొన్ని రోజులుగా మహిళలను భయాందోళనలకు గురిచేస్తున్న ఒక సైకోను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

బాధితురాలు తన చిన్నారిని ప్లే స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను వెంబడించి వెనుక నుండి డ్రెస్సును పైకి లేపి అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. ఈ షాకింగ్ ఘటనపై బాధితురాలు ధైర్యంగా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితుడి కదలికలను ట్రాక్ చేస్తూ ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also :ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి

నిందితుడి వివరాల వెల్లడి - మహిళల భద్రతపై పోలీసుల కఠిన హెచ్చరికలు

పోలీసుల విచారణలో పట్టుబడిన నిందితుడిని గండిపేట మండలం పుప్పాల్గూడలో నివాసం ఉంటున్న వడ్డే నాగరాజు (26)గా గుర్తించారు. ఇతడు మూలతః మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం చాకలిపల్లి గ్రామానికి చెందినవాడని విచారణలో తేలింది. నిర్మానుష్య ప్రాంతాలు లేదా మహిళలు ఒంటరిగా వెళ్లే సమయాలను చూసి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ అరెస్ట్ అనంతరం నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలలో మహిళల రక్షణ కోసం డే అండ్ నైట్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తున్నామని, ఆకతాయిలపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భార్య వియోగం తట్టుకోలేక కుమారుడితో కలిసి చెరువులో దూకిన తండ్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha