AP Govt Taleem-e-Hunar Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన విద్యా పథకాన్ని ప్రకటించింది.
‘తలీమ్-ఇ-హునార్’ (Taleem-e-Hunar) పేరుతో వస్తున్న ఈ పథకం ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నారు.
Read Also: Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్‌కు సర్జరీ పూర్తి
AP Govt Taleem-e-Hunar Scheme: ఏమిటీ తలీమ్-ఇ-హునార్ పథకం?
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులను గుర్తించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యం. కేవలం ఇంటర్ మాత్రమే కాకుండా, జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ (JEE), నీట్ (NEET) వంటి వాటికి కూడా ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు.ప్రతి సంవత్సరం 500 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు.రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ చదివిస్తారు.
Taleem-e-Hunar Scheme AP
ఈ పథకం పూర్తిగా వక్ఫ్ బోర్డు నిధులతో అమలు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను మైనార్టీ సంక్షమే శాఖ ఇప్పటికే ఖరారు చేసింది.వచ్చే విద్యా సంవత్సరం నుంచే తలీమ్-ఇ-హునార్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ముస్లిం యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి చదువు, వసతి కోసం ఏడాదికి సుమారు రూ.2లక్షల వరకు అవుతుందని అధికారులు అంచనా వేశారు. విద్యార్థుల ప్రగతిని వక్ఫ్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

