Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్‌కు సర్జరీ పూర్తి

పవన్ కళ్యాణ్‌కు సర్జరీ పూర్తి

వార్త 2 months ago

Pawan Kalyan Surgery: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం వైద్యులు శస్త్రచికిత్స (Surgery) నిర్వహించారు.

ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు డిప్యూటీ సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

Read Also:Women's Reservation Bill: మహిళా బిల్లుపై ప్రతిపక్షాల తీరు దారుణం: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Pawan Kalyan Surgery: అస్వస్థతకు గురైన వైనం

శుక్రవారం ఓ సమావేశంలో అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలు ఉండటంతో వైద్యులు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పవన్ వారం నుంచి పది రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

వైద్య పరీక్షలు – సర్జరీ నిర్ణయం

మరోవైపు శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్నా అంటూ సూచించారు. నిత్యం రాష్ట్రాభివృద్ధి – ప్రజా సంక్షేమమే ఆశగా, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జల సంరక్షణ మన అందరి బాధ్యత: అధికారుల పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha