Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు: తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు

మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు: తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు

వార్త 3 months ago

తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఉదంతాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. స్నేహం పేరుతో దగ్గరై, అదును చూసి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఇటీవల బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసే ఇందుకు ప్రధాన నిదర్శనం. తెలంగాణ మహిళా భద్రతా విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున 8 పోక్సో కేసులు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత ఏడాది జూన్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కేవలం 11 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2,799 పోక్సో కేసులు నమోదు కావడం గమనార్హం.

Read Also: Pune Acid Attack: అనుమానంతో భార్యపై భర్త యాసిడ్ పోసి, 15 రోజులు బంధించిన భర్త!

 POCSO Cases

POCSO Cases నమ్మకమే గొంతు కోస్తోంది: 94 శాతం కేసుల్లో తెలిసినవారే నిందితులు

అపరిచితుల కంటే బాధితులకు బాగా తెలిసినవారే ఇటువంటి ఘాతుకాలకు ఒడిగడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత 4 నెలల్లో నమోదైన 409 పోక్సో కేసులపై ‘భరోసా కేంద్రం’ అధికారులు జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. ఈ కేసుల్లోని మొత్తం నిందితుల్లో 94 శాతం (385 మంది) బాధితులకు ముందు నుంచే పరిచయం ఉన్నవారే. ఈ నేపథ్యంలో మైనర్ బాలికల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు స్నేహాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు కింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారుతెలిసీ తెలియని వయసున్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదు. ఒకవేళ ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే సురక్షితమైన ఏర్పాట్లు చేయాలి. ప్రవర్తనను గమనించండి: పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను నిశితంగా గమనించాలి. వారు భయపడుతున్నా లేదా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా ప్రేమగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పాలి.బంధువులు, చుట్టుపక్కలవారు పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంపై వారికి తెలియకుండా నిఘా ఉంచాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో దారుణం.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha