UK Child Abuse: యూకే (UK)లోని లీడ్స్ నగరంలో ఒక భారతీయ యువకుడు దారుణమైన చర్యకు పాల్పడుతూ స్థానిక ప్రజల చేతికి అడ్డంగా చిక్కాడు. మైనర్ బాలికను లైంగికంగా లోంగదీసుకునేందుకు ప్రయత్నించిన ఆ యువకుడిని స్థానికులు పట్టుకుని నిలదీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వైరల్ అవుతున్నాయి.
తమను తాము ‘బ్రిటిష్ పేట్రియాట్స్’ అని పిలుచుకునే స్థానిక గ్రూప్ సభ్యులు ఈ ఘోరాన్ని బట్టబయలు చేశారు. అయితే తప్పు చేస్తూ దొరికిపోవడంతో.. సదరు యువకుడు తనను వదిలేయమంటూ వారి కాళ్లావేళ్లా పడ్డాడు. ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బతిమాలుకున్నాడు.
Read Also : US Attack to Iran : ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
Indian youth arrested in minor case… ‘Last chance please’, tearful plea
UK Child Abuse: లీడ్స్ వర్సిటీ మాజీ విద్యార్థి నిర్వాకం
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 27 ఏళ్ల ప్రవ్నా భట్‌గా గుర్తించారు. నిలదీసిన సమయంలో అతడు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై అతడు బ్రిటన్‌కు వచ్చాడు. అక్కడ ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ప్రస్తుతం చదువు ముగిసిన తర్వాత లభించే పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్‌డబ్ల్యూ) పై యూకేలోనే నివసిస్తున్నాడు. ఆన్‌లైన్ చాటింగ్‌లో సదరు బాలిక వయసు కేవలం 14 ఏళ్లు అని తెలిసినప్పటికీ.. ప్రవ్నా భట్ ఆమెకు నిరంతరం అసభ్యకరమైన, లైంగిక వేధింపులతో కూడిన సందేశాలను పంపాడు. ఒక చాట్‌లో బాలిక వయసు తెలిసిన వెంటనే “నేను జైలుకు వెళ్లడం ఖాయం” అని నవ్వుతున్న ఎమోజీలతో మెసేజ్ పెట్టినట్లు వెల్లడి అయింది.
కాళ్లు పట్టుకుని బతిమాలుకున్న నిందితుడు
తప్పు అని తెలిసినప్పటికీ ఆమెను తన గదికి రహస్యంగా రమ్మని, హోటల్ రూమ్ బుక్ చేయమని వేధించాడు. అంతేకాకుండా తన నగ్న వీడియోలను కూడా ఆమెకు పంపాడు. చివరికి బాలికను కలవడానికి నిర్దేశిత ప్రాంతానికి వచ్చి వేచి చూస్తుండగా స్థానికులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాను చేసిన దారుణం బయటపడటంతో ప్రవ్నా భట్ ప్రజల ముందు తీవ్రంగా రోదించాడు. “నేను ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఇకపై ఎప్పుడూ చేయను. దయచేసి నన్ను వదిలేయండి. పోలీసులకు మాత్రం సమాచారం ఇవ్వకండి” అంటూ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డాడు.
బ్రిటన్‌లో వరుస ఘటనలు.. నెటిజన్ల ఆగ్రహం
యూకేలో భారతీయ యువకులు ఇలాంటి ఆన్‌లైన్ చైల్డ్ గ్రూమింగ్ కేసుల్లో చిక్కడం ఇదే మొదటిసారి కాదు. గత జనవరిలోనే కోవెంట్రీ నగరంలో గురీత్ జితేష్ అనే మరో భారతీయ విద్యార్థి మైనర్ బాలికల వేధింపుల కేసులో బ్రిటన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడు యూకే వచ్చిన మూడు నెలలకే ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ఇలాంటి ఘోరాలకు పాల్పడుతూ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

