Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు

ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు

వార్త 2 months ago

US Attack to Iran : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ వైమానిక చర్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై మరోసారి విరుచుకుపడింది.

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిధిలో ప్రాంతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు ప్రమాదకరమైన దాడి డ్రోన్లను లాంచ్ చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన అమెరికా వైమానిక దళం ఆ నాలుగు డ్రోన్లను గాల్లోనే విజయవంతంగా కూల్చివేసింది. అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎదురయ్యే నిఘా ముప్పును తిప్పికొట్టేందుకు రక్షణ చర్యల్లో భాగంగా గోరుక్ (Goruk) మరియు క్వెర్మ్ ఐలాండ్ (Qeshm Island) తీర ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ కోస్టల్ నిఘా రాడార్ సైట్లపై అమెరికా క్షిపణులతో ఎయిర్ స్ట్రైక్స్ జరిపి, వాటిని ధ్వంసం చేసింది.

Read Also : యుద్ధానికి ముగింపు పలుకుదాం.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ

 Iran attack news

సడలుతున్న కాల్పుల విరమణ.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో వణుకు

ఈ తాజా వైమానిక దాడులు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువుల రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఘర్షణలు జరగడం వల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లై గొలుసుకు తీవ్ర ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజా దాడులు అంతర్జాతీయ మార్కెట్లను మరింత గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమెరికా-ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార దాడుల పరంపర ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సహారా ఎడారిలో తీవ్ర విషాదం ..నీళ్లు దొరక్క 49 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha