NTR statue unveiling: మహా నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది.
అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
Ameerpet Mythrivanam NTR statue
ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు మంచు మనోజ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై అన్నగారికి నివాళులర్పించారు.
Read also: Ashwini Vaishnaw: త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందన్న అశ్వినీ వైష్ణవ్
అన్న నీడన బతికి.. ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడుతారా?
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఎన్టీఆర్ వేసిన ముద్రను, ఆయన కల్పించిన రాజకీయ అవకాశాలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.
NTR statue unveiling: కేసీఆర్‌కు పొలిటికల్ భిక్ష:
“ఈ రోజు పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న కేసీఆర్‌కు అసలైన రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీఆరే. నాాడు అన్నగారు గనుక అవకాశం ఇచ్చి ప్రోత్సహించకపోతే మీరు ఈ స్థాయికి వచ్చే వారా?” అని రేవంత్ రెడ్డి నిలదీశారు. నాటి ఎన్టీఆర్ హయాంలోనే కేసీఆర్‌తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి, జానారెడ్డి, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి ఎందరో దిగ్గజ నాయకులు రాజకీయంగా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రామారావు అనే పేరును పెట్టుకున్న కొందరు నకిలీలు కూడా ఈ రోజు సమాజంలో పెద్ద లీడర్లుగా తిరుగుతున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కల్పించిన రాజకీయ అవకాశాల చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

