Dailyhunt
మలప్పురంలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి

మలప్పురంలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి

వార్త 2 weeks ago

Shashi Tharoor Convoy Attack: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌పై జరిగిన దాడి మలప్పురం జిల్లాలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

వండూరు నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also:Alcohol Price Hike: పెరగనున్న మద్యం ధరలు.. కారణం ఇదే!

Shashi Tharoor Convoy Attack :ఘటన వివరాలు

వండూరు నియోజకవర్గ యుడీఎఫ్ (UDF) అభ్యర్థి ఏపీ అనిల్‌కుమార్ తరపున ప్రచారం నిర్వహించిన శశిథరూర్, శుక్రవారం సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.వండూరు సమీపంలోని చెల్లితోడ్ వద్ద కారు, బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు థరూర్ వాహనాన్ని ఒక్కసారిగా అడ్డగించారు.దుండగులు థరూర్‌ను దూషించడమే కాకుండా, అడ్డుకోబోయిన ఆయన గన్‌మన్‌, డ్రైవర్‌లపై భౌతిక దాడికి దిగారు.గన్‌మన్‌ ఫిర్యాదు మేరకు వండూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి, ఉమర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై ఆరా తీస్తున్నామని, విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.అంతకుముందు ప్రచారంలో మాట్లాడిన శశిథరూర్, కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువతకు రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha