Alcohol Price Hike: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. కేవలం గ్యాస్, పెట్రోల్ ధరలే కాకుండా, ఇప్పుడు ఆ సెగ మద్యం బాటిళ్ల వరకు చేరింది.
అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడంతో, ఈ వేసవిలో మందుబాబుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, అది నేరుగా భారతీయ మద్యం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది.
Read Also:Marginal Relief: పెరిగిన జీతం పన్ను భారంగా మారుతోందా?
గాజు బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగ
మద్యం తయారీ కంటే, దానిని ప్యాక్ చేసే గాజు బాటిళ్ల తయారీ ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది.భారత్ తన సహజవాయువు అవసరాల కోసం 40% వరకు ఖతార్‌పైనే ఆధారపడుతుంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడంతో కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నిజానికి బీర్ తయారీ కంటే దాని ప్యాకేజింగ్ వాటా 40 శాతం. కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాల్లో) ఇది 20 శాతం వరకు ఉంటుంది.
Liquor Prices Hike India Middle East War
గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడటం వల్ల అది నేరుగా గాజు బాటిళ్ల తయారీపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ కష్టాలు, కమర్షియల్ గ్యాస్ ధరల వల్ల గాజు బాటిళ్ల ధర 15-20 శాతం పెరినట్లు ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చోప్రా అంటున్నారు.అంతర్జాతీయంగా రవాణా ఖర్చులు (Shipping Charges) పెరగడం వల్ల కంపెనీలు అదనంగా 10-15% ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.బీర్ కాన్ల తయారీకి వాడే అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
Alcohol Price Hike: వేసవిలో బీర్ల కొరత?
వేసవి కాలంలో బీర్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే గ్యాస్ సరఫరా ఇలాగే ఇబ్బందిగా ఉంటే, గాజు ఫర్నెస్ లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవని మెడుసా బేవరేజెస్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్‌లో బాటిళ్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధం సామాన్యుడి వంటింటి గ్యాస్ నుంచే కాకుండా, మందుబాబుల ‘చిల్’ అయ్యే ఆశలపై కూడా నీళ్లు చల్లుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

