Dailyhunt
మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యి ఇళ్లు దగ్ధం

మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యి ఇళ్లు దగ్ధం

వార్త 6 days ago

Malaysia Fire Accident: మలేషియాలోని సబా రాష్ట్రంలో ఊహించని రీతిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సందకన్ జిల్లాలోని కాంపంగ్ బహగియా ప్రాంతంలో మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి.

ఈ ప్రమాదంలో సుమారు వెయ్యి ఇళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

Read Also:Strait of Hormuz: యూరోపియన్ యూనియన్ తీరుపై ఇరాన్ ఆగ్రహం

 Massive fire in Malaysia.. Thousands of houses burnt down

Malaysia Fire Accident: 9 వేల మంది నిరాశ్రయులు

సముద్రంపై కర్రలతో నిర్మించిన ఇళ్లు కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 9 వేల మంది ప్రజలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బాధితులందరూ ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మరోసారి రెచ్చిపోయిన కిమ్.. జపాన్ తీరంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha