Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ 100% సుంకాలతో ట్రంప్ వార్నింగ్.. మరి భారత్ పరిస్థితి ఏమిటి?

మళ్లీ 100% సుంకాలతో ట్రంప్ వార్నింగ్.. మరి భారత్ పరిస్థితి ఏమిటి?

వార్త 1 week ago

Trump Tariffs : గూగుల్, యాపిల్, మెటా, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని 'డిజిటల్ సేవల పన్ను' (Digital Services Tax) విధించాలని చూస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.

అమెరికన్ కంపెనీలపై అటువంటి పన్నును అమలు చేసే ఏ దేశానికైనా, ఆ దేశం నుండి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 100 శాతం ప్రతీకార సుంకాలను (Tariffs) విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ తాజా ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో శుక్రవారం చేసిన ఒక సుదీర్ఘ పోస్ట్‌లో ట్రంప్ ఈ వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించారు. అనేక ఐరోపా దేశాలు అమెరికన్ కంపెనీలపై డిజిటల్ సేవల పన్నును త్వరలోనే అమలు చేయడానికి చర్చిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటన ద్వారా నేను స్పష్టం చేస్తున్నది ఏంటంటే.. అటువంటి పన్ను విధించే ఏ దేశమైనా యునైటెడ్ స్టేట్స్‌కు పంపే తన వస్తువులన్నింటిపై తక్షణమే 100 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆయన రాశారు.

Read Also: US - Iran War : అమెరికా దాడులపై ఇరాన్ స్పందన

 Trump Tariffs

Trump Tariffs: డిజిటల్ పన్ను విధిస్తే మాత్రం ఈ కఠిన చర్యలు

ఈ ప్రతిపాదిత 100 శాతం సుంకం విధింపు అనేది ఆయా దేశాలతో అమెరికాకు ఉన్న లేదా భవిష్యత్తులో కుదరబోయే వాణిజ్య ఒప్పందాలన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తుందని (Supersede) ట్రంప్ తేల్చి చెప్పారు. వాణిజ్య ఒప్పందాలు ఇప్పటికే అమలులో ఉన్నా, సంతకం చేసినా లేదా చర్చల దశలో ఉన్నా సరే.. డిజిటల్ పన్ను విధిస్తే మాత్రం ఈ కఠిన చర్యలు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు. విదేశాలలో అమెరికన్ టెక్నాలజీ రంగం పట్ల వివక్షాపూరిత వైఖరిని అడ్డుకోవడానికి మరియు అమెరికా ప్రయోజనాలను రక్షించడానికి సుంకాలను ఒక కీలక ఆర్థిక ఆయుధంగా ఉపయోగించే ట్రంప్ దూకుడు వాణిజ్య విధానానికి ఈ ప్రకటన నిదర్శనంగా నిలిచింది.

హర్మూజ్‌లో మళ్లీ యుద్ధ వాతావరణం..ఇరాన్‌పై అమెరికా దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha