Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ హీటెక్కనున్న జంతర్మంతర్?

మళ్లీ హీటెక్కనున్న జంతర్మంతర్?

వార్త 2 weeks ago

Jantar Mantar : కేంద్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానం మరోసారి ఆందోళనలకు కేంద్రబిందువు కాబోతోంది.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) రాజీనామా చేయాలని మరియు ఎన్నికల సంఘంలో (EC) సమగ్ర ప్రక్షాళన చేపట్టీ పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) తో పాటు వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవడానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనాలని ఆయా సంఘాల నాయకులు కోరుతుండటంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం తీవ్ర ఘర్షణాత్మకంగా మారింది.

పోలీసుల ఆంక్షలు - విద్యార్థి సంఘాల అల్టిమేటం!

ఈ ధర్నా కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. నిరసనలకు సంబంధించి కనీసం 10 రోజుల ముందే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని, చివరి నిమిషంలో (లాస్ట్ మినిట్) ఇచ్చే వినతులకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ శాంతియుతంగా తలపెట్టిన ఈ జంతర్ మంతర్ ఆందోళనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే, నిరసనలను రాజధాని ఢిల్లీ నగరవ్యాప్తంగా విస్తరింపజేసి రస్తారోకోలు చేపడతామని CJP మరియు విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఫుట్‌పాత్‌పై పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha