Bangalore News: బెంగళూరు నగరంలోని బ్యాగ్లూర్ మెయిన్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై అమర్చిన ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టె ఒక్కసారిగా పేలిపోయింది.
ఆ సమయంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులపై ఈ ప్రమాద ప్రభావం పడటంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Transformer explodes on footpath; two sustain severe injuries.
Bangalore News: చేతులకు తీవ్ర గాయాలు.. తప్పించుకున్న విద్యార్థిని
ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడే ఉన్న ఒక వ్యక్తి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన రెండు చేతులకు తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి. ఆయనతో పాటు ఉన్న మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో ఫుట్‌పాత్‌పై వెళ్తున్న ఒక పాఠశాల విద్యార్థిని ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో సురక్షితంగా బయటపడింది. తన పిల్లలను పాఠశాలలో దింపేందుకు వెళ్తున్న అరుణ్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ భయాందోళనకర దృశ్యాలను చిత్రీకరించారు.
ఫుట్‌పాత్‌లపై ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు.. బాధ్యులెవరు?
జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల్లో, సాధారణ పౌరులు నడిచే ఫుట్‌పాత్‌లపై ఇలాంటి ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎలా అనుమతిస్తారంటూ స్థానికులు, బాటసారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు లేదా దివ్యాంగులు వెళ్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, నగర పాలక సంస్థల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. రెప్పపాటులో 4 యువ క్రికెటర్లు దుర్మరణం!

