Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ పుంజుకున్న పసిడి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే

మళ్లీ పుంజుకున్న పసిడి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే

వార్త 1 week ago

Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా పసిడి రేట్లు పుంజుకున్నాయి. ఇది స్వల్ప పెంపే అయినప్పటికీ, రాబోయే వారంలో కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలకు బాటలు వేసింది.

Gold silver Jewellery: బంగారం, వెండి ఆభరణాలపై కేంద్రం సంచలన నిర్ణయం

 Gold prices pick up again… here are today’s rates

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి, వెండి కాంట్రాక్టులు లాభాల్లో కొనసాగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.10 శాతం మేర పెరగగా, వెండి ఫ్యూచర్స్ 0.35 శాతం లాభంతో కిలోకు రూ. 2,12,370 వద్ద ట్రేడ్ అయింది. ఇక దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ. 220 మేర పెరుగుదల నమోదై రూ. 1,47,660 వద్ద స్థిరపడింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 200 పెరిగి రూ. 1,35,350 కి చేరుకోగా, 18 క్యారెట్ల పసిడిపై రూ. 160 మేర పెరిగింది.

Gold Rates: ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నమోదైన 10 గ్రాముల బంగారం ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ. 1,47,660 | 22 క్యారెట్లు – రూ. 1,35,350
  • ముంబై: 24 క్యారెట్లు – రూ. 1,47,660 | 22 క్యారెట్లు – రూ. 1,35,350
  • బెంగళూరు: 24 క్యారెట్లు – రూ. 1,47,690 | 22 క్యారెట్లు – రూ. 1,35,610
  • చెన్నై: 24 క్యారెట్లు – రూ. 1,47,710 | 22 క్యారెట్లు – రూ. 1,35,990

ఒక గ్రాము బంగారం రేట్ల వివరాలు (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం)

తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలతో పాటు ముంబై, బెంగళూరు నగరాల్లో నేడు ఒక గ్రాము బంగారం ధరలు ఒకే విధంగా నమోదయ్యాయి:

  • 24 క్యారెట్లు (1 గ్రాము): రూ. 14,766
  • 22 క్యారెట్లు (1 గ్రాము): రూ. 13,535
  • 18 క్యారెట్లు (1 గ్రాము): రూ. 11,074

Epaper: epaper.vaartha.com

6500mAh బ్యాటరీతో కొత్త టెక్నో 5G ఫోన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha