Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మళ్లీ యుద్ధం ఖాయం'.. ఇరాన్ సైనిక అధికారి హెచ్చరిక!

'మళ్లీ యుద్ధం ఖాయం'.. ఇరాన్ సైనిక అధికారి హెచ్చరిక!

వార్త 1 month ago

Iran-US War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ ఉద్రిక్తతలపై ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహమ్మద్ జాఫర్ అసదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం సంభవించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also :Donald Trump: మిత్రదేశానికి ట్రంప్ 'బిగ్ షాక్'.. 5 వేల మంది సైనికులు ఔట్!

 Iran-US War: ‘War is certain again’.. Iranian military officer warns!

అమెరికా వైఖరిపై ఇరాన్ అసహనం

శాంతి చర్చల విషయంలో ఇప్పటికే అనిశ్చితి నెలకొనగా, ఇరాన్ పంపిన తాజా ఒప్పంద ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ జాఫర్ అసదీ మాట్లాడుతూ.. చమురు ధరలను తగ్గించుకోవడానికి, తాము సృష్టించుకున్న గందరగోళం నుండి బయటపడటానికే అమెరికా అధికారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమపై మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని, శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూళ్లు

మరోవైపు, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా ట్రెజరీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విధించే ఈ టోల్ పన్నును చెల్లించే షిప్పింగ్ సంస్థలు కఠినమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. టోల్ చెల్లింపులతో పాటు ఇరాన్ సైన్యానికి మద్దతు ఇచ్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు తాము వెనకాడబోమని వాషింగ్టన్ తేల్చి చెప్పింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha