Shantanu Sen: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా, మాజీ రాజ్యసభ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ శంతను సేన్ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తీవ్ర కలకలం రేపారు.
Shantanu Sen Resigns
Read also: Karnataka politics: జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు.. సిద్ధరామయ్య
వరుసగా కీలక నేతల గుడ్‌బై
టీఎంసీ మహిళా విభక్ష చైర్‌పర్సన్, ఎంపీ కకోలీ దస్తీదార్ ఘోష్ పార్టీలోని అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజే శంతను సేన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరుసగా ఇద్దరు సీనియర్ నేతలు మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదవుల నుంచి తప్పుకోవడం బెంగాల్ రాజకీయాన్ని వేడెక్కించింది.
Shantanu Sen: అవినీతి, ఆర్జీకర్ కేసుపై తీవ్ర మనస్తాపం
తన రాజీనామాకు గల కారణాలను డాక్టర్ శంతను సేన్ బహిరంగంగానే వెల్లడించారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపిన లేఖలో ఆయన సంచలన విషయాలను ప్రస్తావించారు. 2024 నాటి ప్రతిష్టాత్మక ఆర్జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటన, రాష్ట్రంలో వెలుగుచూసిన ఉపాధి నియామకాల అవినీతి వంటి అంశాల వల్ల ప్రజలు తృణమూల్‌ను తిరస్కరించారని ఆయన అభిప్రాయపడ్డారు. క్లిష్ట సమయాల్లో పార్టీ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలతో తాను ఏకీభవించలేదని, అయినప్పటికీ మీడియా ముందు పార్టీని సమర్థించాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో తాను బహిరంగంగానే తప్పులను ప్రశ్నించినప్పుడు సాధారణ ప్రజలు తనను ఎంతగానో అభినందించారని పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

