Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు.. సిద్ధరామయ్య

జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు.. సిద్ధరామయ్య

వార్త 2 weeks ago

Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం నాడు తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

తనకు కాంగ్రెస్ హైకమాండ్ దిల్లీ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ‘రాజ్యసభ’ సీటును ఆఫర్ చేసిందని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టం చేశారు.

Read Also : Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

 Not interested in national politics.. Siddaramaiah

Karnataka politics: దిల్లీ వద్దు: సిద్ధరామయ్య క్లారిటీ

తనకు జాతీయ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని సీనియర్ నేత సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. “నాకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని లేదు. కర్ణాటకలోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతాను. భవిష్యత్తులోనూ రాష్ట్ర క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు. సీఎం పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉండబోతున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.

గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి లేఖ అందజేత

గురువారం మధ్యాహ్నం బెంగళూరులోని లోక్ భవన్‌లో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనుల నిమిత్తం తన సొంత ఊరైన ఇండోర్‌లో ఉండటంతో ఆయన నగరంలో అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్‌కు సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ ల్యాండ్‌మార్క్ పరిణామం చోటుచేసుకున్న సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర కేబినెట్ సహచరులు సిద్ధరామయ్య వెంటే ఉన్నారు.

రాజీనామా సమర్పించడానికి ముందు సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలో కేబినెట్ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా.. అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను తప్పుకుంటున్నానని, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని మంత్రులకు అధికారికంగా తెలియజేశారు. కాగా, సిద్ధరామయ్య రాజీనామా లేఖను తాను స్వీకరించానని, ఇండోర్ నుంచి గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఆమోదిస్తారని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ మీడియాకు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha