Manchu Vishnu : 'కన్నప్ప'తో భారీ ప్రయత్నం చేసిన మంచు విష్ణు ఇప్పుడు తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
నిర్మాతగా, హీరోగా సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నప్ప సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విష్ణు (Manchu Vishnu), ఆ ప్రాజెక్ట్ తర్వాత వెంటనే మరో సినిమాను ప్రకటిస్తారని అభిమానులు భావించారు. అయితే ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొత్త కథలతో వెళ్తున్నప్పటికీ :
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మంచు విష్ణు వద్దకు పలువురు దర్శకులు కొత్త కథలతో వెళ్తున్నప్పటికీ, వాటిలో ఏదీ ఆయనను పూర్తిగా ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తోంది. కథ, పాత్ర, కమర్షియల్ అంశాలు, కొత్తదనం అన్నీ సమతూకంగా ఉండే స్క్రిప్ట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత సినిమాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నారట.
Manchu Vishnuఇక తదుపరి సినిమా కూడా తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పైనే రూపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కథ ఫైనల్ అయిన తర్వాత దర్శకుడిని ప్రకటించి, ఆ తర్వాతే అధికారికంగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని విష్ణు భావిస్తున్నట్టు సమాచారం. భారీ స్థాయిలో కాకపోయినా, బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా చేయాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.
అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు విష్ణు లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నవి కేవలం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తలు మాత్రమే. నిజంగానే మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారా? లేక ఇప్పటికే ఒక కథను ఫైనల్ చేసి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తిరువీర్, ఆషికా రంగనాథ్‌తో SKN కొత్త సినిమా 'అది నా పిల్లరా'!

