Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మండుతున్న ఎండలు.. ఏసీ బస్సులే దిక్కా?

మండుతున్న ఎండలు.. ఏసీ బస్సులే దిక్కా?

వార్త 3 weeks ago

TSRTC AC Buses:హైదరాబాద్ నగరంలో ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో చలిగాలులు ఉండాల్సింది పోయి తీవ్రమైన ఉక్కపోత వేధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ప్రతికూల వాతావరణం వల్ల ఐటీ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రయాణికులు సైతం ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో TSRTC హైదరాబాద్ ఏసీ బస్సులు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆర్టీసీ గతంలో ప్రవేశపెట్టిన 30 శాతం టికెట్ ధరల తగ్గింపు వల్ల ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం 60 నుంచి 85 శాతానికి పైగా పెరిగింది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా నగరంలో ఏసీ బస్సుల సంఖ్యను ఆర్టీసీ యంత్రాంగం తక్షణమే పెంచాలని కోరుతున్నారు.

Bandlaguda Traffic: బండ్లగూడ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు

 Increased demand for air-conditioned buses

ఐటీ కారిడార్ రూట్లలో బస్సుల కొరత ప్రయాణికుల తీవ్ర అవస్థలు

గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు వెళ్లే టెక్కీలు ట్రాఫిక్ తిప్పలు, ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఈ-మెట్రో ఏసీ బస్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 90 కి పైగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు, పుష్పక్ సర్వీసులతో పాటు 275 కి పైగా మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కలిసి రోజుకు 1000 కి పైగా ట్రిప్పులు తిరుగుతున్నప్పటికీ నిత్యం పెరిగే ప్రయాణికుల రద్దీకి ఇవి ఎంతమాత్రం సరిపోవడం లేదు. కోఠి, సికింద్రాబాద్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి ఐటీ జోన్లకు వెళ్లే రూట్లలో ఏసీ బస్సుల కోసం గంటల తరబడి ఆగాల్సి వస్తోంది. ఆఫీసులు, కళాశాలల వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతుండటంతో శివారు ప్రాంతాల నుంచి ఐటీ జోన్లకు నేరుగా ఏసీ బస్సులు నడపాలని, రాత్రి వేళల్లో కూడా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.

TSRTC AC Buses:ఐటీ జోన్లకు నడుస్తున్న ప్రధాన ఏసీ బస్సులు రూట్ల వివరాలు

ఆర్టీసీ ప్రస్తుతం ఐటీ కారిడార్ అనుసంధానానికి పలు కీలక మార్గాల్లో ఏసీ బస్సులను నడుపుతోంది. లింగంపల్లి నుంచి మెహదీపట్నం వెళ్లే 216 డబ్ల్యూ బస్సు నల్లగండ్ల, గోపన్ పల్లి, విప్రో సర్కిల్, ఖాజాగూడ మీదుగా ప్రయాణిస్తుంది. లింగంపల్లి నుంచి లక్ష్మిగార్ వెళ్లే 216 జి బస్సు నల్లగండ్ల, క్యూ సిటీ, గార్ ఐటీ పార్క్ మీదుగా చేరుకుంటుంది. బాచుపల్లి నుంచి వేవ్ రాక్ వెళ్లే ఏసీ బస్సు జేఎన్టీయూ, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ ద్వారా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి షేక్ పేట్, రాయదుర్గం మీదుగా, పటాన్ చెరు నుంచి జేబీఎస్ కు 219 నంబర్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. పుష్పక్ విభాగంలో మియాపూర్ నుంచి ఏజే రూట్, లింగంపల్లి నుంచి ఏకే రూట్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సేవలు అందుతున్నాయి.

Epaper: epaper.vaartha.com

ఏసీబీకి చిక్కిన బంజారాహిల్స్ సబ్ ఇన్ స్పెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha