Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంగళూరు రిఫైనరీలో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు

మంగళూరు రిఫైనరీలో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు

వార్త 1 day ago

Mangaluru : కర్ణాటక, మంగళూరులోని ఒక రిఫైనరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళూరులో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) వద్ద బుధవారం ఈ పేలుడు జరిగింది.

మొత్తం ఎనిమిది మంది గాయపడగా.. వీరిలో ఒకరికి 35 శాతం కాలిన గాయాలైనట్లు ఎంఆర్‌పీఎల్ సంస్థ వెల్లడించింది. జోకట్టే గ్రామ పరిధిలోని ఎంఆర్‌పీఎల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. పేలుడు ప్రభావానికి భారీగా పొగ వ్యాపించింది. కొన్ని కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. చాలా దూరం నుంచి ఈ పొగ కనిపించిందని స్తానికులు తెలిపారు. పేలుడు ప్రభావంతో రిఫైనరీ చుట్టుపక్కల బిల్డింగులు, నివాసాలు కూడా కంపించాయి. అంతేకాదు.. బాజ్పే పరిధిలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పేలుడు నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు అలర్ట్ ప్రకటించారు.

 Mangaluru

Mangaluru : సహాయక చర్యలు కొనసాగుతున్నాయని

ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్టును తనిఖీ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, సహాయక బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సుల్ని మోహరించారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha