Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మన్ననూరులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన గుడిసె.!

మన్ననూరులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన గుడిసె.!

వార్త 1 month ago

AchampetaFire Accident: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపాన ఉన్న మల్లాపూర్ పెంటలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒక పేద కుటుంబానికి చెందిన పూరి గుడిసె పూర్తిగా కాలిపోయింది.

ఎండలు మండిపోతుండటంతో నిప్పు రవ్వ తగిలిన వెంటనే గుడిసె అంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కాసేపు కలకలం రేగింది.

Read also: Jagitial News: ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!

 Fire accident in Mannanur village hut

AchampetaFire Accident: చిన్నారులకు తప్పిన ముప్పు: ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు

ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల తల్లిదండ్రులు ఇంట్లో లేరు. గుడిసెలో ఇద్దరు చిన్నారులు మాత్రమే ఉండగా, మంటలను గమనించి వారు వేగంగా బయటకు పరుగులు తీశారు. దీంతో తృటిలో పెద్ద ప్రాణాపాయం తప్పినట్లయింది. పిల్లలు క్షేమంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్గిపెట్టెతో ఆడుకోవడం వల్ల లేదా ఎండ వేడి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

నిరుపేద కుటుంబం రోడ్డున: అన్నీ బుగ్గిపాలే

ఈ అగ్నిప్రమాదంలో ఆ కుటుంబం సర్వం కోల్పోయింది. ఇంట్లో దాచుకున్న బియ్యం, పప్పులు వంటి ఆహార సామాగ్రితో పాటు బట్టలు, నిత్యావసర వస్తువులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. నిలువ నీడ లేక ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రైతులకు తీపి కబురు.. మే 5-7 వరంగల్‌లో 50-90% సబ్సిడీ యంత్రాలు: పొంగులేటి ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha